ఓ‘ఇంటి’వాడైన ‘సుడిగాలి’ సుధీర్!

sudigali-sudheer-bought-house

ఈటీవి ప్రేక్షకులను జబర్దస్త్‌ పోగ్రామ్ తో నవ్విస్తున్న సుడిగాలి సుధీర్ రీసెంట్ గా ఓ ఇంటివాడయ్యాడు. అయ్యయ్యో.. ఇంటివాడనగానే పెళ్లైపోయింది అనుకోకండి. ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో గడిపిన సుధీర్ తాజాగా ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు. ఈ సందర్బంబా తనలోని టాలెంట్‌ను గుర్తించి అవకాశం కల్పించిన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు, ఈటీవీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలియజేశాడు సుధీర్. అదే విధంగా తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక యాంకర్ రష్మిగౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఇద్దరిపై సెటైర్లు వేయడం ఓ కారణం అయితే, రేష్మి, సుధీర్ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం లాంటివి చూసిన వారెవ్వరికైనా ఈ అనుమానం రాక తప్పదు. జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ కొంతకాలంగా రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు కేవలం గాసిప్స్ గానే ఉండిపోయాయి… నిజా నిజాలు ఏమిటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే రేష్మి, సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగడానికి మూల కారణం మేమే అని గెటప్ శ్రీను వెల్లడించారు. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి.. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి, స్కిట్ లో పంచ్ లు పేలడానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరదాగా కామెంట్స్ చేసే వారమని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*