బాగ్దాద్‌లో పెండ్లి వేడుకపై ఆత్మాహుతి దాడి 26 మంది దుర్మరణం

First Video of Suicide Attack at a Wedding Ceremony Near Karbala, 26Killed

బాగ్దాద్: ఇరాక్ దేశం ఉత్తర బాగ్దాద్‌లోని ఓ పెండ్లి వేడుకలో బుధవారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి బాంబుదాడుల్లో 26 మంది మృత్యువాతపడ్డారని, దాదాపు 67 మంది గాయపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. బాగ్దాద్‌కు 130 కి.మీ దూరంలోని టిక్రిట్ పట్టణ సమీపంలో ఉన్న హజాజ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఓ పెండ్లి వేడుకకు అందరూ హాజరయ్యారు. పేలుడు పదార్థాలు నింపిన జాకెట్ ధరించిన ఓ వ్యక్తి వేడుకలోని జనం వద్దకు వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. మిగిలిన వారు సహాయక చర్యలు చేపడుతుండగానే.. రెండోవ్యక్తి కూడా పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ప్రాంతీయ అధికార ప్రతినిధి అలీ అల్‌హమ్‌దాని మీడియాకు తెలిపారు. పేలుళ్లు జరిగిన తీరును పరిశీలిస్తే ఇది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పనేనని అనుమానిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటివరకు పేలుళ్లకు తమదే బాధ్యత అని ఎవరూ ప్రకటించలేదని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*