తెలుగు వాళ్లు మరీ ఇంతగానా, భూతాన్ని పూజిస్తున్నారు

swarupananda-terms-saibaba-as-ghost

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా సాయి అనే భూతాన్ని పూజిస్తున్నారని, షిర్డిసాయి భూమిపై పుట్టారే తప్ప అవతరించిన వారు కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. సాయిని దేవుడిని చేసి హిందువులను మూర్ఖులను చేయవద్దని అన్నారు. సాయిని దత్తాత్రేయ, కృష్ణుడు, రాముడు, విష్ణువు రూపాల్లో కొలుస్తున్నారని గుర్తు చేస్తూ అది తప్పు అని అన్నారు. సీతారాం బదులు సాయిరాం అని ఎందుకు అంటున్నారో వారే ఆలోచించుకోవాలని స్వరూపానంద వాఖ్యానించారు. సంతోషిమాత వచ్చింది.. వినాయకుడు పాలు తాగాడు అంటూ సనాతన ధర్మం పరువు తీయవద్దన్నారు. జిహాద్‌ పేరిట పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు దేశమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాదులోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ లలితకళాతోరణంలో దర్శనం పత్రిక పుష్కరోత్సవం సందర్భంగా స్వరూపానంద గురువందనం చేశారు. సనాతన ధర్మమే హిందూత్వమని అన్నారు. ఎదుటి వారి ఆకలిని తీర్చి, ప్రతిప్రాణిలో పరమాత్మను చూసేవాడే హిందువు అని అన్నారు. హిందూదేశంలో పుట్టిన వారందరూ హిందువులని కొత్త వ్యాఖ్యలు వస్తున్నాయని, అవి అవాస్తవమని అన్నారు. వేదాలను పఠించి, గోమాతను పూజించి, గోదావరి, కృష్ణలను పూజించేవారే హిందువులని అన్నారు. భారతదేశంలో మహిళలను పూజించే సంస్కృతి ఉండేదని, అయితే ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం మద్యం సేవించడమేనన్నారు. సాయిబాబా దేవుడు కాదని ఇక్కడ కాదు.. షిర్డీలో సాయి సంస్థాన్‌ సభ్యులకే సవాల్‌ విసిరామని, రెండునెలలు గడువిచ్చినా ఎవరూ ముందుకు రాలేదని అమృతానంద స్వామి అన్నారు. సభ అనంతరం ‘సాయిని కొలవం, కొలిచిన వారితో కలవం’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. కాగా స్వరూపానంద స్వామి సాయి గురించి మాట్లాడుతుండగా సభలో ఉన్న సాయి భక్తులు ఒక్కసారిగా నిలబడి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read more at: http://telugu.oneindia.com/news/telangana/swarupananda-terms-saibaba-as-ghost/slider-pf107623-186667.html

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*