జయ పేపర్లు చదువుతున్నారట ?

tamil-nadu-chief-minister-j-jayalalithaa-could-not-leave-hos

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అన్నాడీఎంకే నాయకులు తిప్పికొడుతున్నారు. జయలలిత ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆమె పేపర్లు చదువుతున్నారని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరు సెల్వంకు శాఖలు అప్పగించే విషయంపై జయలలితకు సందేశం పంపించామని, అందుకు అమ్మ సరే అన్నారని, ఆమె స్పృహలోనే ఉన్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీ.ఆర్. సర్వసతి చెప్పారు. జయలలితకు ఇన్పెక్షన్ ఉన్న కారణంగా ఎవరినిపడితే వారిని లోపలికి అనుమతించడం లేదని, కేవలం వైద్యులు మాత్రం లోపలికి వెళ్లి ఆమెకు సందేశాలు వినిపిస్తున్నారని సీ.ఆర్. సరస్వతి వివరించారు. జయలలిత తన శాఖలను పన్నీరు సెల్వంకు అప్పగించడానికి అంగీకరించారని చెప్పడంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే చీఫ్ కరుణా నిధి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత ఫైల్ మీద సంతకం చేశారా ? లేదా ? అనే అనుమానాలు అన్ని వర్గాల ప్రజలకు ఉందని మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అన్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*