జయలలిత చాలా బాగున్నారు

tamil-nadu-cm-jayalalithaa-is-fine-her-party-assures-aiadmk

తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత ఆరోగ్యంపై అన్నాడీఎంకే పార్టీ బుధవారం తాజా ప్రకటన విడుదల చేసింది. జయలలిత చాలా బాగా కోలుకున్నారని, త్వరలోనే అమ్మ ఇంటికి వస్తారని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. జయలలిత అనారోగ్యంతో ఆగస్టు 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి జయ ఆరోగ్యంపై చాలా వదంతులు, ఊహాగానాలు వ్యాపించాయి. జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు, రాజ్ భవన్ ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించాయి.  జయలలిత ఆరోగ్యంలో వేగంగా పురోగతి వస్తోందని, త్వరలో ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంటారని ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రం ఆందోళన చెందారు. జయలలిత అభిమానులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై పుకార్లు, వందతులు వ్యాపించడానికి కారణం అయిన అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. దిపావళి పండుగ దగ్గరకు రావడంతో ఏడీఏడీఎంకే నాయకులు బుధవారం జయమ్మ చాలా బాగున్నారని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత ఆరోగ్యంపై అన్నాడీఎంకే పార్టీ బుధవారం తాజా ప్రకటన విడుదల చేసింది. జయలలిత చాలా బాగా కోలుకున్నారని, త్వరలోనే అమ్మ ఇంటికి వస్తారని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. దిపావళి పండుగ దగ్గరకు రావడంతో ఏడీఏడీఎంకే నాయకులు జయమ్మ చాలా బాగున్నారని అధికారికంగా ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*