ఫేక్ చెక్ తో నన్ను మోసం చేసారు:తాప్సి

tapsee-cheated-famous-tollywood-producer

పింక్ సినిమా మంచి టాక్ అందుకున్న దగ్గరి నుంచీ తాప్సీ రెచ్చిపోయి కామెంట్లు చేస్తోంది. నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలో అని పొద్దున్నుంచీ ఇక అదే మాట్లాడేస్తోంది.ఆమధ్య తనని కేవలం స్కిన్ షో కోసమే వాడుకున్నారనీ. అసలౌ తన నటన చూపించే అవకాశమే రాలేదనీ. పింక్ తనలోని నటనని బయటకి తెచ్చిందనీ చెప్తూ టాలీవుడ్ మీద రాళ్ళేసింది ఈ పింక్ భామ. నిజానికి బాలీవుడ్ లో కూడా హీరోయిన్ ని స్కిన్ షో కోసం వాడుకునే సినిమాలే ఎక్కువ. అంతే కాదు టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా హీరోయిన్ లీడ్ పాత్రలు చేస్తూ పోతూంటే ఆ తర్వాత హీరోలు ఎవరూ ఆమె ని దగ్గరకు రానివ్వరు. ఇప్పటికే టాలీవుద్ లో అనుష్క ఆ విషయం అర్థమయ్యే నెమ్మదిగా తానే లీడ్ గా ఉండే పాత్రలను తగ్గించుకోవాలనే ఆలోచిస్తోంది. అయితే మరి బాలీవుడ్ మెప్పు పొందటానికో ఏమో గానీ ఇన్నాళ్ళూ మామూలుగానే ఉన్న తాప్సీ అక్కడ పింక్ హిట్ టాక్ తెచ్చుకోగానే ఇక టాలీవుడ్ తో పని లేదనుకుందో ఏమో గానీ పదే పదే ఇన్ డైరెక్ట్ గా టాలీవుడ్ ని టార్గెట్ చేస్తూనే ఉంది. ఏదో ఒక విషయం లో ఇక్కడి ఇందస్ట్రీ పై ఒక పాట అంటూనే ఉంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనకు టాలీవుడ్ లో రెమ్యూనరేషన్ విషయంలో కూడా మోసం జరిగిందని తాప్సీ వ్యాఖ్యానించడం. ఒక నిర్మాత తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వలేదని, ఫేక్ చెక్కులను రాసిచ్చి మోసం చేశాడని తాప్సీ పేర్కొంది. అతడి పేరు చెప్పలేదు కానీ.. ఈ మోసం గురించి ఇప్పుడు ప్రస్తావించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*