టిడిపి తీవ్ర వ్యాఖ్యలు

tdp-leaders-takes-on-ys-jagan-his-party-leaders

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదని, ఆయనకే లేని బుద్ధి ఇక ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులకు ఎలా వస్తుందని, వారి నుంచి అది ఆశించడంతప్పవుతుందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆయన ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. గుడ్లగూబలు వెలుగును, గుంటనక్కలు మంచిని చూడలేవని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకుల వ్యవహారం కూడా అలానే ఉందన్నారు. కోర్టులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చెప్పులు కొనుక్కునే స్థోమత లేనివారు ఏకంగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్తున్నారంటే వారి వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. వ్యోక్స్ వ్యాగన్ కేసులో బొత్స, ఏపీఐసీసీ భూముల స్కాంలో రూ.వందల కోట్లు మింగిన అంబటికి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*