బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ చేసిన మణికట్టు మాయాజాలంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బుధవారం నాటి మ్యాచ్‌లో సుందర్ నాలుగు ఓవర్లు వేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.బుధవారం నాటి మ్యాచ్‌లో భారత జట్టు విజయంలో సుందర్‌దే కీలక పాత్ర అని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘బంతితో మాయ చేసిన సుందర్మాకు అద్భుతమైన విజయాన్నందించాడు’ అని మ్యాచ్ ముగిశాక రోహిత్ ఆకాశానికెత్తేశాడు. కొత్త బంతితో బౌలింగ్ చేయటం అంతసులువు కాకపోయినప్పటికీ అప్పగించిన బాధ్యతను అద్భుతంగా ముగించిన సుందర్‌కు మొదట బౌలింగ్ ఇచ్చేందుకు రోహిత్ కాస్త సందేహించినా మొదటి ఓవర్లోనే తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. ఆ తర్వాత కావలసిన విధంగా ఫీల్డింగ్ సెట్ చేసుకుని వికెట్లు పడగొడుతూ.. పరుగులు నియంత్రిస్తూ బౌలింగ్ చేశాడు. ఒక్క మ్యాచ్‌తో సుందర్ ప్రతిభను మాజీలు ప్రశంసిస్తున్నారు. ఈటోర్నీలో అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్‌గా రికార్డుల్లో ఉన్న సుందర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేయటం స్పిన్నర్లకు సవాల్ లాంటిదంటు న్నాడు. అటువంటి ఛాలెంజ్‌ను ఎదుర్కొని సత్తా చూపెట్టినప్పుడే విజయం అందుతుందన్నాడు. ‘ క్రికెట్లో ఇలాంటి సవాళ్లు సహజం, వాటిని ఎదుర్కొని నిలబడగలగాలి, అప్పుడే ప్రతిఫలం దక్కుతుంది’ అని సుందర్ అంటున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆఫ్ స్పిన్నర్లకు ఎప్పుడూ ఢోకా లేదని సుందర్ చెబుతున్నాడు.
భారత జట్టు విజయం
March 16, 2018 Andhravoiceadmin ఆంధ్ర ప్రదేశ్, క్రీడలు, జాతీయం-అంతర్జాతీయం 0
Leave a Reply