పక్కా వాస్తుతో పాటు….అన్ని హాంగులతో కొత్త సచివాలయ నిర్మాణం

telangana-excisting-secretariat-built-witout-proper-vaastu

వాస్తు దోషం ఉందనే కారణంగానే తెలంాణ సచివాలయాన్ని కూల్చివేయాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. సచివాలయం నిర్మాణం వాస్తు ప్రకారంగా నిర్మించని కారణంగా అనేక దుష్పలితాలు సంభవించాయని కెసిఆర్ విశ్వసిస్తున్నారు.వాస్తు దోషం లేకుండా అన్ని హాంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమౌతోంది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఉన్న ఆవరణలోనే ఎపి సచివాలయానికి కూడ భవనాలను కేటాయించారు. అమరావతి నుండే ఎపి పాలన సాగుతోంది.దీంతో ఈ భవనాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.ఈ విషయమై ఎపి ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించింది.ఈ భవనాలను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. తెలంగాణ సచివాలయం వాస్తు ప్రకారంగా లేదని సిఎం కెసిఆర్ విశ్వసిస్తున్నారు. ఇప్పటికే వాస్తు ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు సచివాలయంలో చేశారు. సిఎం కెసిఆర్ కు వాస్తు సలహాదారు సుద్దాల సుదాకర్ తేజ సూచనల ప్రకారంగా మార్పులు చేర్పలు చేశారు. ఏడాది క్రితం వరకు సచివాలయంలోని పెట్రోల్ బంక్ పరక్క నుండి ఉద్యోగులు వచ్చేంుకు ఉన్న గేటును మూసివేశారు. ఈ గేటు ఓపెన్ చేయడం సరి కాదని వాస్తు నిపుణులు సూచించారు. మరో వైపు సి బ్లాక్ సమీపంలో ఉన్న మీడియో లాంజ్ వాస్తు ప్రకారంగా లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*