నాని నాన్నయ్యాడు!

తన సహజ నటనతో ఆకట్టుకుంటూ వరుస విజయాలు సాధిస్తూ తారా పంథంలో దూసుకుపోతున్న యువ హీరో నాని నాన్నయ్యాడు. బుధవారం ఉదయం తెల్లవారు జామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నాని సతీమణి అంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారని హీరో నాని సన్నిహితులు తెలిపారు. నాని, అంజన 2012లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేను లోకల్ సక్సెస్ తరువాత నిన్ను కోరి పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ప్రస్తుతం నాని నటిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే అమెరికాలో జరిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*