సాఫ్ట్‌వేర్‌ సాయంతో తీవ్రవాదులపై ట్విటర్‌ పోరు

సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు కొందరు. ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేలా పోస్టులు చేస్తున్నారు. దీంతో అటువంటి వాటిని అడ్డుకునే పనిలో పడింది ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌. ట్వీట్లతో త్రీవవాద కార్యకలాపాలకు పాల్పడేవారు.. ఉగ్రవాదులతో సంబంధాలున్న యూజర్లను గుర్తించి.. వారి ఖాతాలను బ్యాన్‌ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు ట్విటర్‌ చెప్పింది.

ఆన్‌లైన్‌ తీవ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యంలో మతపరమైన.. జాతి విద్వేష ఘర్షణలను ప్రేరేపించే వ్యక్తుల ఖాతాలను తొలగించాలంటూ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలపై కొన్ని ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో గత రెండేళ్ల నుంచి అలాంటి ఖాతాలను గుర్తించే పనిలో పడింది ట్విట్టర్‌. అయితే మాన్యువల్‌ పద్ధతిలో పూర్తిస్థాయిలో ఖాతాలను గుర్తించడం ఆలస్యమవుతుండటంతో దీని కోసం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ‘ఇంటర్నల్‌, ప్రొప్రైటరీ స్పామ్‌-ఫైటింగ్‌ టూల్‌’ సాయంతో తీవ్రవాదుల ఖాతాలను గుర్తిస్తోంది. 2016 చివరి ఆరు నెలల్లో దాదాపు 3,77,000 ఖాతాలను ట్విటర్‌ సస్పెండ్‌ చేయగా.. అందులో 74శాతం ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో గుర్తించినవేనని సంస్థ తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*