అందరూ క్షేమం

థాయ్‌లాండ్‌లోని లువాంగ్‌ గుహలో అత్యంత ప్రమాదకరంగా చిక్కుకున్న ఫుట్‌బాల్‌ బృందంలోని 12 మంది బాలురతో పాటు , కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు థారు నేవీసీల్స్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.18రోజుల పాటు నిరంతరాయంగా థారునేవీ సీల్స్‌ బృందం వారిని బయటకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లు అధికారులు తెలిపారు. ‘అందరూ క్షేమం’ అని థారునేవీ సీల్స్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. జూన్‌ 23వ తేదీన వైల్డ్‌ బోర్స్‌ ఫుట్‌బాల్‌ బృందం బాలురను తీసుకుని కోచ్‌ చియాంగ్‌ రారు పరిధిలోని ఒక గుహలోకి వెళ్లారు. అందులోకి వెళ్లగానే భారీ వర్షాలు రావడంతో బురద చేరి వారందరూ అందులో చిక్కుకుపోయారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళన తలెత్తింది. బృందంలో ఉన్న కోచ్‌ బాలురతో కూడిన ఓ వీడియోను సెల్‌ఫోన్‌కు పంపించడంతో అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. వారం రోజులపాటు వారి వద్దకు వెళ్లేందుకు కూడా సాధ్యం కాలేదు. చివరకు నేవీ సీల్స్‌ రంగంలోకి దిగి గుహలో బాలురు ఉన్న ప్రాంతానికి చేరుకుని అక్కడ వివరాలు బయటకు తెలిపారు. థారులాండ్‌ కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలు, ఇక్కడి కాలమానం ప్రకారం 10.30 గంటలకు రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభమైంది. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండటంలో వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, బాలురను రక్షించేందుకు వెళ్లి మ తి చెందిన థారు నేవీ సీల్‌ మాజీ డైవర్‌ సమన్‌ కునన్‌కు ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. రియల్‌ హీరో అంటూ కొనియాడుతున్నారు. తామంతా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నారు. గుహలో చిక్కుకున్న చిన్నారులను రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన సమన్‌ గుహలోకి వెళ్లి ఆక్సిజన్‌ సిలిండర్లను అందించారు. తిరిగి వస్తూ ఆక్సిజన్‌ సరిపడా అందక మ తి చెందారు. చిన్నారులందరూ బయట పడిన వేళ సమన్‌ను రియల్‌ హీరోగా కీర్తిస్తూ ఘన నివాళి అర్పిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*