మరో ఘనత ‘బాహుబలి 2’ సొంతం

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి 2’ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్‌గా రికార్డు సృష్టించిన ఈ చిత్రం అత్యధిక థియేటర్లో విడుదవుతోన్న చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 6,500 థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు మూవీ ఇండస్ట్రీ ట్రాకర్‌ రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రాన్ని ఇన్ని స్క్రీన్లపై ప్రదర్శించలేదని చెప్పారు.

‘బాహుబలి 2’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌ పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆడియోను ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*