సెంట్ర‌ల్ వ‌ర్సిటీల్లో 20 శాతం ఖాళీలు

న్యూఢిల్లీ: కేంద్ర విశ్వ‌విద్యాల‌యాల్లో సుమారు 20 శాతం ఖాళీలు ఉన్న‌ట్లు కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఇవాళ ఆయ‌న లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మాట్లాడుతూ ఈ అంశాన్ని వెల్ల‌డించారు. మ‌న వ‌ర్సిటీ విధానాల ప్ర‌కారం పార్ట్‌-టైమ్ ప్రొఫెస‌ర్‌ ఉద్యోగాలు లేవ‌న్నారు. ఒక్క ఏడాదిలోనే వ‌ర్సిటీల్లో ఉన్న ఖాళీల‌ను పూర్తి చేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వ‌ర్సిటీల్లో టీచ‌ర్ల రిటైర్మెంట్ వ‌య‌సును 65 ఏళ్ల‌కు పెంచామ‌ని, అయితే రిటైర్ అయిన టీచ‌ర్ల‌నే మ‌ళ్లీ కాంట్రాక్ట్ ప‌ద్థ‌తిలో వాళ్ల‌కు 70 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు రిక్రూట్ చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ఖాళీలు పూర్తి చేసే ప్ర‌క్రియ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వ‌హిస్తూ ఉండాల‌ని అన్ని వ‌ర్సిటీల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి చెప్పారు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేసిన‌ విద్యార్థుల‌ను ప్రొఫెస‌ర్లుగా తీసుకుంటున్నామ‌న్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి రిక్రూట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీలో 60 శాతం, జేఎన్‌యూలో 30 శాతం, త‌మిళ‌నాడులో 62 శాతం, ఒడిశాలో 85 శాతం ఖాళీలు ఉన్నాయ‌ని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ ఆరోపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*