ఈ రేసింగ్‌ బైక్‌ ధర రూ.5.86 లక్షలు

ముంబై : హార్లే డేవిడ్‌సన్‌ ఇండియా తన సరికొత్త మధ్య స్థాయి రేసింగ్‌ బైక్‌ స్ర్టీట్‌రోడ్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5.86 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ). దీని బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. 750 వి-ట్విన్‌ ఇంజన్‌ కలిగిన ఈ బైక్‌ ఇప్పటికే మార్కెట్లోకి తెచ్చిన స్ర్టీట్‌ 750 బైక్‌కన్నా 11 శాతం అధిక హార్స్‌ పవర్‌, 5 శాతం అధిక టార్క్య్‌ను కలిగి ఉంటుందని కంపెనీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ పల్లవి సింగ్‌ తెలిపారు. డ్యూయల్‌ 300 ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌లతోపాటు ఎబిఎస్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఈ బైక్‌లో ఉందని చెప్పారు. భారతలో యువ కుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కొత్త బైక్‌ను తెచ్చామని సింగ్‌ పేర్కొన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*