తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది జవాన్లు మృతి చెందినట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ తెలిపారు. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. మావోయిస్టుల కదలికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*