బాలయ్య సినిమాకు సరికొత్త టైటిల్

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత బాలయ్య చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుపై అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. తొలిసారి పూరీ జగన్నాథ్ తో కలిసి బాలయ్య సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై చాలా హోప్స్ ఉన్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. రేపటితో ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తి కానున్నట్టు తెలుస్తుండగా , ఆ తర్వాత టీం యూరప్ షెడ్యూల్ జరుపుకోనున్నట్టు సమాచారం. ఇక ఏప్రిల్ 7 నుండి మే 7 వరకు లండన్ షెడ్యూల్ జరుపుకోనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ టైటిల్ ప్రచారం జరుగుతుంది. పూరీ సినిమా టైటిల్ అంటేనే చాలా క్యాచీగా ఉంటాయి. అలాంటింది బాలయ్య సినిమాకు ఏ టైటిల్ పెడతాడా అని కొద్ది రోజులుగా అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు వచ్చారు. అయితే పూరీ జగన్నాథ్.. బాలకృష్ణ చిత్రానికి ‘టపోరి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్ తోనే సినిమాపై సగం హైప్స్ తీసుకొచ్చే పూరీ తన తాజా చిత్రానికి కూడా పవర్ ఫుల్ టైటిల్ పెట్టాడని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*