అమ్మ ఫొటోతో తమిళనాడు కేబినేట్ సమావేశం

tn-cabinet-meeting-with-jayalalithaas-photo

తమిళనాడు రాష్ట్రమంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి తప్ప కేబినేట్ సమావేశాలు నిర్వహించడంతోపాటు జయకున్న ఇతర మంత్రిపదవులు ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వమ్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 24తో మేయర్ల, కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తుండటంతో వారి స్థానాల్లో అధికారుల నియామకంపై కేబినేట్ లో చర్చించారు. త్వరలో అధికారుల నియామకంపై ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అమ్మ ఆసుపత్రిలో చేరాక కేబినేట్ సమావేశం మొదటిసారికాగా, అన్నా డిఎంకే మేలో అధికారంలోకి వచ్చాక (వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం) కేబినేట్ సమావేశం మూడోసారి జరిగినట్లైంది. మొదటి, రెండు సమావేశాలకు జయ అధ్యక్షత వహించగా, మూడోదానికి పన్నీరు సెల్వమ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

10total visits,1visits today

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*