రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11:25కి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు బీఏసీలో నిర్ణయం జరిగింది. ఈనెల 16న సీఎం బడ్జెట్‌పై సమాధానం చెబుతారు. ఈనెల 27న రెండు సెషన్ల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈనెల 28న ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతారు. ఈనెల 31వరకూ సమావేశాలు పొడిగించాలని బీఏసీలో నిర్ణయించారు. అలాగే రేపు ఉదయం 7గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. దీనిలో బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*