వన్డేల్లో టాప్-6 ఛేజింగ్‌లన్నీ ఆ జట్టు మీదే!

top-6-chasings-in-odi-all-are-against-australia-only

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మరోసారి ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. 2006లో వాండరర్స్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ 434 పరుగుల భారీ స్కోరు సాధించడమే సంచలనం కాగా, మరో బంతి మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా ఆ లక్ష్యాన్ని సాధించి రికీ పాంటింగ్ సేనకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పుడు డర్బన్‌లో జరిగిన మూడో వన్డేలోనూ అదే రీతిలో షాకిచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్మిత్ సేన 371 పరుగుల భారీ స్కోరు సాధించగా, సౌతాఫ్రికా జట్టు అలవోకగా లక్ష్యాన్ని సాధించి ఆరేళ్ల క్రితం నాటి ఫీట్‌ను గుర్తుకు తెచ్చింది. 434 పరుగుల ఛేజ్ అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యధిక పరుగుల చేధన కాగా, ఇప్పటి ఫీట్ రెండోది.
డర్బన్ మ్యాచ్‌కు ముందు రెండో అత్యధిక ఛేజింగ్ రికార్డు భారత్ పేరిట ఉండేది. 2013లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో భారత జట్టు 362 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది. జైపూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా, భారత్ కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 43.3 ఓవర్లలోనే 362 పరుగులు చేసింది. నాలుగో అత్యుత్తమ ఛేజింగ్ కూడా భారత్ పేరిటే ఉంది. నాగ్‌పూర్లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఈ ఫీట్ సాధించింది. అంతే కాదు న్యూజిలాండ్ జట్టు కూడా ఆస్ట్రేలియాను ఓ ఆటాడుకుంది. టాప్-5, 6 ఛేజింగ్ రికార్డులను కివీస్ జట్టు ఆసీస్‌పైనే సాధించింది. 2007లో జరిగిన ఛాపెల్-హడ్లీ సిరీస్‌లో న్యూజిలాండ్ వరుస మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి, ఆసీస్‌కు షాకిచ్చింది. పాపం ఆస్ట్రేలియా ఎంత టాప్ టీం అయినప్పటికీ, టాప్-6 ఛేజింగ్ రికార్డులన్నీ ఆ జట్టు మీదే ఉండటం ఆసీస్ ఆటగాళ్లకు మింగుడు పడటం లేదు. ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా, భారత్, కివీస్‌లు రెండేసి సార్ల చొప్పున ఓ ఆటాడుకున్నాయన్న మాట. డర్బన్ వన్డేలో ముందుగా డీకాక్(70) , హషీమ్ ఆమ్లా(45) స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మిల్లర్ ఊచకోత కోశాడు. కేవలం 79 బంతుల్లోనే 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మిల్లర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫెహుల్వాయో(42 నాటౌట్)తో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైన ఆసీస్ సిరీస్‌ను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(117), స్టీవ్ స్మిత్(108) సెంచరీలు సాధించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*