మానవ సహిత అంగారక యాత్రకు ట్రంప్ ఆమోదం

వాషింగ్టన్ : అంగారక గ్రహంపైకి మానవ సహిత యాత్ర చేపట్టడంతోపాటు నాసా కార్యక్రమాలకు సంబంధించిన కొత్త బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేశారు. నాసా చట్టం ప్రకారం 2018వ సంవత్సరంలో నాసా కార్యక్రమాల కోసం దాదాపు 2000 కోట్ల డాలర్లు(రూ. 1,34,000కోట్లు) ఖర్చు చేయనున్నారు. 2030వ సంవత్సరం లోపు అరుణగ్రహంపైకి మానవ సహిత యాత్రను చేపట్టడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఈ చట్టంలో నిర్దేశించారు. ఈ బిల్లుపై సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉన్నదని, ఇది ఉద్యోగ కల్పనకు దోహదపడడంతోపాటు నాసాకువరం అని ట్రంప్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో సౌర వ్యవస్థలో మానవ అన్వేషణ కార్యక్రమాన్ని సురక్షితంగా చేపట్టడానికి అవసరమైన అత్యాధునికమైన అణు గడియారాన్ని ఈ ఏడాది చివరిలో నాసా అంతరిక్షంలోనికి పంపించనున్నది. ఇది అంతరిక్షంలో కాల గణనకు ముఖ్యపాత్ర పోషించనున్నది. భవిష్యత్తులో సుదూర అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా మారనున్నది. గతంలో అంతరిక్షంలోకి పంపించిన అన్ని అణు గడియారాల కంటే ఇది తేలికైనది, చాలా చిన్నది, కచ్చితమైన సమాచారం ఇస్తుందని నాసా తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*