‘టిటిడి ఆదాయంలో తెలంగాణ వాటా రూ.1,000 కోట్లు, ఇప్పించండి’

ttd-owes-rs-1-000-cr-telangana-temples

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణ వాటా కోసం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.1000 కోట్లు ఇప్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏపీ, తెలంగాణ అంతర్భాగంగా ఉండేదని, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ టిటిడికి తెలంగాణకు చెందిన బోర్డు మెంబర్స్ ఉన్నందున వాటా ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో టిటిడికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయని, పలు దేవాలయాల అభివృద్ధికి టిటిడి నిధులు సమకూరుస్తున్నందున తిరుమల వచ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*