జయపై పుకార్లు

two-more-arrested-spreading-false-information-on-cm-jalalithaa-s-healt

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై లేనిపోని పుకార్లు సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న ఇద్దరిని చెన్నై నగర క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని విచారిస్తున్నామని గురువారం పోలీసులు చెప్పారు. తుత్తకుడిలోని ప్రయివేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న తిరుమణి సెల్వం (28), చెన్నై నగరంలోని ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బాలసుందరం (48) అనే ఇద్దరు జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించారు. విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*