అన్ని పాఠశాలలు రెండో శనివారం సెలవు పాటించాల్సిందే: ఎస్సిపిసిఆర్ సభ్యులు సీతారాం

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని వివిధ యాజమాన్యాల పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రెండో శనివారం సెలవు పాటించాల్సిందేనని లేకుంటే ఆయా స్కూళ్లు గుర్తింపు రద్దు చేయడమే కాకుండా శాఖా పరమైన చర్యలకు సిఫారసు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం చెప్పారు.

శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సీతారాం మాట్లాడుతూ ఇదే అంశంపై ఇటీవల విశాఖ నగరంలో కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో ప్రైవేటు,కార్పొరేటు పాఠశాలల యాజమాన్యాలతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమావేశంలో కమిషన్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని అన్నారు,అలాగే వీటి అమలుకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు కు కమిషన్ సూచనలు చేసిందని, పూర్తి స్థాయిలో వీటి అమలుపై తనిఖీలు చేపట్టి ఆయా వివరాలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు,ఏ యాజమాన్యానికి ప్రత్యేక మినహాయింపులు ఏవీ ఉండవని అన్నారు,ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా ప్రభుత్వ సూచనలు,రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు అమలు జరిగేలా విద్యా శాఖాధికారులు దృష్టి సారించాలని అన్నారు. కమిషన్ ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి తన దైన శైలిలో చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు,పాఠశాలలు తెరిచినట్టు ఆధారాలతో పాటు apscpcr2018@gmail.com కి గానీ ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు గానీ ఫిర్యాదులు అందించాలని సీతారాం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *