– కృష్ణా కాలేజీ నుండి మద్దిలపాలెం వరకు ప్రదర్శన, హైవేపై అరెస్ట్
శనివారం విశాఖపట్నం మోడీ వచ్చిన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో కృష్ణ కాలేజ్ రోడ్డు నుండి ఏయూ గ్రౌండ్ కి ప్రదర్శనగా వెళ్ళారు. ప్రదర్శన ఆడుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. మద్దిలపాలెం హైవేపై పోలీసులు అడ్డగించి 35 మందిని అరెస్టులు చేసి ఎంవిపి పోలీస్ స్టేషన్, బేరక్స్ తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఆర్కే ఎస్.వి కుమారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అమ్మకం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర ద్రోహం చేస్తున్న మోడీకి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికి లక్షలాది మందిని బహిరంగ సభకు తరలించడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖపట్నం రాజధానిగా ఉండాలంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే సాధ్యపడుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్మిక వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసనని పోలీసులు అరెస్టులు చేయించడం దుర్మార్గమన్నారు. నిన్నటి నుండి వామపక్ష పార్టీల నాయకులను ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టులు చేసి కేసులు పెట్టడం అనేది సరైంది కాదన్నారు. ఈరోజు జరిగే సభలో స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని మోడీతో ప్రకటన చేయించాలని కోరారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం నాయకులు బీ జగన్, బొట్టా ఈశ్వరమ్మ, బి పద్మ, రాంబాబు, సుబ్బారావు, చంటి, కృష్ణారావు సిపిఐ నాయకులు వామనమూర్తి, విమల, రెహ్మాన్, పడాల రమణ తదితరులు వున్నారు.