నీళ్లలో హాకీ ఆట

హాంకాంగ్: అండర్ వాటర్ హాకీ పేరు కొత్తగా ఉన్నా..ఆట పాతదే! అవును 1950లో బ్రిటిష్ నేవీ డైవర్స్ కనిపెట్టిన ఈ క్రీడ పాశ్చాత్య దేశాల్లో చాలా మందికి పరిచయం. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి దేశాల్లో అభిమానులు బాగా ఉన్నారు. ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లతో జరిగే ఈ ఆటకు ఆసియాలో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తున్నది. చైనా, మలేషియా, హాంకాంగ్ దేశాలు అండర్ వాటర్ హాకీ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. నీటి అడుగు భాగంలో జరిగే ఈ క్రీడలో ఆటగాళ్లందరూ ఓ చిన్నపాటి హాకీ స్టిక్, చెవుల్లోకి నీళ్లు వెల్లకుండా ఉండేందుకు రక్షణగా ఏర్పాట్లు, గ్లోవ్స్, ఈదడానికి అనుకూలంగా ఉండేందుకు కాళ్లకు ప్రత్యేకమైన తొడుగులతో బరిలోకి దిగుతారు.

28 ఏండ్ల హెన్రీ చాన్ అనే యువకుడు అమెరికాలో చదువుకునే రోజుల్లో ఈ అండర్ వాటర్ హాకీని ఎలా ఆడాలో నేర్చుకుని హాంకాంగ్‌కు పరిచయం చేశాడు. 2010లో అండర్ వాటర్ హాకీ పేరిట ఓ ఫేస్‌బుక్ పేజీని తయారుచేసిన చాన్‌కు అనతికాలంలోనే దాదాపు 200 మంది ఫాలోవర్లు అయ్యారు. ఇందులో నుంచి ఆసక్తికగల ఆటగాళ్లతో కూడిన జట్టు గతేడాది మేలో తొలిసారి ఓ టోర్నీలో పాల్గొంది. చెంగ్డులో జరిగిన చైనా కప్‌లో మొత్తం 11 జట్లు పాల్గొంటే.. చాన్ ప్రాతినిధ్యం వహించిన జట్టు మూడో స్థానంలో నిలిచింది. అయితే అండర్‌వాటర్ హాకీ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవడమే తమ జట్టు లక్ష్యమని చాన్ పేర్కొన్నాడు. వచ్చే మేలో జరిగే చైనా కప్‌లో ప్రథమ బహుమతి దక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం చేశాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*