యునిటెక్‌ ఎండీ అరెస్టు..!

దిల్లీ: హవాలా కేసులో రియల్‌ఎస్టేట్‌ కంపెనీ యునిటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ చంద్రను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం తెల్లవారుజామున దిల్లీ ఎకనమిక్‌ ఆఫీసెస్‌ వింగ్‌ పోలీసులు సంజయ్‌, అతడి సోదరుడిని అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

గ్రేటర్‌ నోయిడాలోని రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులో ఫ్లాట్లను ఇస్తామని చెప్పి తమను మోసం చేశారంటూ కొనుగోలుదారులు యునిటెక్‌ కంపెనీపై కేసు వేశారు. 2008 ఏప్రిల్‌ నాటికి తమకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి తమ నుంచి డబ్బు వసూలు చేశారని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమకు ఫ్లాట్లు ఇవ్వలేదు సరికదా.. తమ డబ్బును కూడా తిరిగివ్వలేదని ఆరోపించారు. దీంతో యునిటెక్‌ యజమానులపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు నేడు సంజయ్‌, అతడి సోదరుడిని అరెస్టు చేశారు. 2011లోనూ 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో సంజయ్‌ అరెస్టయ్యారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*