భారత్‌కు హక్కుంది

 

us-backs-india-s-right-self-defence-slams-pakistan-linkin

యూరి ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ఎల్వోసీని దాటి పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించింది. దీని పైన ఆమెరికా భారత్‌కు అండగా నిలబడింది. అదే సమయంలో కాశ్మీర్‌లో శాంతికి, ఆప్ఘనిస్తాన్‌లో శాంతికి పాకిస్తాన్ పొంతన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యూరి ఘటన నేపథ్యంలో భారత్‌కు ఆత్మరక్షణ హక్కుందని అమెరికా తెలిపింది. అఫ్గాన్‌లో శాంతికీ, కాశ్మీర్‌ అంశానికీ ముడిపెట్టేందుకు పాకిస్థాన్‌ చేసిన యత్నాలను కొట్టిపారేసింది. భారత్‌, అమెరికాలవి అత్యంత చలనశీల సంబంధాలని వైట్ హౌస్‌లో దక్షిణాసియా వ్యవహారాలకు సంబంధించిన అధికారి పీటర్‌ లావోయ్‌ పేర్కొన్నారు. యూరీ ఘటన సీమాంతర ఉగ్రవాదమనేది స్పష్టమని పేర్కొంది. ఆ ఉగ్రచర్యను ఖండిస్తున్నామన్నారు. ప్రతి దేశానికీ స్వీయరక్షణ హక్కు ఉంటుందని చెప్పారు. భారీస్థాయిలో సైనిక మోహరింపులతో కూడిన సంబంధాలు ఇప్పటికే మూడు యుద్ధాలు చూశాయనీ, నిగ్రహంతో ఉండాలన్నారు. భారత్‌కు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం కృషి చేస్తున్నామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*