ఆర్టీసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరే షన్‌ తొలి చైర్మన్‌గా నియమితు లైన వర్ల రామయ్య బుధవారం ఆర్టీసి హౌస్‌లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రి కె అచ్చన్నాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఫైలుపై తొలి సంతకం చేసిన రామయ్య మాట్లాడుతూ ప్రత్యేక స్థానం ఉన్న ఆర్టీసిని కాపాడతానన్నారు. ఆర్టీసిని ఒక కుటుంబంగా భావించి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానన్నారు.  గుర్తింపు సంఘంతో పాటు అన్ని యూని యన్లకూ తగిన ప్రాధాన్యత ఇస్తానన్నారు. అప్పట్లో ఆర్టీసి కండక్టర్‌ రోడ్డు ప్రమాదం లో చిక్కుకుంటే ప్రమాదవశాత్తూ జరిగిన యాక్సిడెంట్‌గా భావించి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని పోరాటం చేసిన వారిలో తానూ ఒకడినని గుర్తు చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, కె అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసి ఎండి సురేంద్రబాబు, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజి, రాజ్య సభ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి, జడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న, కరణం బలరాం, విజయవాడ మేయర్‌ శ్రీధర్‌, ఎమ్మెల్యే వర్మ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*