ఎన్‌ఐడిఎం శంకుస్థాపన సభలో .. వెంకయ్యనాయుడు

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే వెలుతురు ఎక్కువగా ఉంటుదని, దానిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు పచ్చదనాన్ని కాపాడుకోవాలన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.37.76 కోట్లతో ఏర్పాటు చేసే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడిఎం) దక్షిణాది క్యాంపస్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అన్నారు.  ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులే వణికిస్తున్నాయని, భూకంపాలు, తుపాన్లు వస్తే జన నష్టంతోపాటు ఆస్తి నష్టం జరుగుతోందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో కోస్తా తీరప్రాంతం చాలా ఎక్కువగా ఉందని, జాతీయ విపత్తులను అధిగమించడానికి ఎన్‌ఐడిఎం సంస్థను ఆంధ్రాలో ఏర్పాటు చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. ఏ సంస్థ రావాలన్నా భూములు కావాలని, ప్రభుత్వం భూములు ఇవ్వడంతో సెంట్రల్‌ సంస్థలు ఎక్కువగా ఆంధ్రాకు వచ్చాయని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*