10రోజుల్లో డిశ్చార్జ్: జయను పరామర్శించిన సుజనా, మురళీమోహన్

vidyasagar-rao-sujana-chowdary-meets-jayalalithaa

గత కొంత కాలంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను శనివారం ఉదయం తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పరామర్శించారు. జయలలిత ఆరోగ్యం మెరుగైందన్న వైద్యుల ప్రకటనతో ఆయన రెండోసారి పరామర్శించారు. దాదాపు 25 నిమిషాల పాటు గవర్నర్‌ ఆసుపత్రిలోనే గడిపారు. శనివారం చెన్నైకి బయల్దేరిన కేంద్రమంత్రి సుజనా చౌదరి సీఎం జయలలిత చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. జయలలితను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.  కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు మురళీ మోహన్‌, సీఎం రమేశ్‌ తదితరులు అపోలో ఆసుపత్రికి వెళ్లి జయను పరామర్శించారు. అనంతరం సుజనాచౌదరి మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్యం 95శాతం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అవసరమని, 10 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు చెప్పారని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*