విమ్స్‌ ప్రయివేటీకరణ జిఒ 33ను తక్షణం రద్దు చేయాలి సిపిఎం

విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా సిపిఎం కార్యాలయంలో శుక్రవారం పోస్టర్‌ ఆవిష్కరించారు. దీన్ని ప్రయివేటుపరం చేసే జిఒ 33ను తక్షణం రద్దు చేయాలని సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిఒ రద్దుపై మంత్రి గంటా శ్రీనివాసరావుతో సిపిఎం బృందం చర్చలు జరిపిందన్నారు. ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానా ఫలితం లేదన్నారు. లోకేష్‌ స్నేహితునికి రూ.2 వేల కోట్ల విలువైన విమ్స్‌ను కట్టబెట్టేందుకు ప్రయివేటుకు అప్పగిస్తున్నారన్నారు విమ్స్‌ నిర్వహణకు అవసరమైన రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసి శాశ్వత వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని నియమించాలని కోరారు. ల్యాబ్‌లు, బ్లడ్‌ బ్యాంకు తదితరాలను అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించడం సరికాదన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*