విశాఖపట్నం ఆర్థిక ప్రగతి దెబ్బ

విశాఖపట్నంలో విమానాల రాకపోకలపై తూర్పు నౌకాదళం రోజూ ఐదు గంటలపాటు నిషేధం విధించడంతో విశాఖ ప్రగతిపై ప్రభావం చూపే పరిస్థితి ఉంది. నౌకాదళ అధికారుల నిర్ణయం కారణంగా ఐటీ, ఫార్మా, పర్యాటక, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడి ఆర్థిక ప్రగతి దెబ్బతినే పరిస్థితి ఉంది. అయితే నావికాదళ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కేవలం రక్షణ చర్యల్లో భాగంగానే పౌర విమానాల రాకపోకల సమయాన్ని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. విశాఖ విమానాశ్రయం రక్షణశాఖ పరిధిలో ఉండటంతో విమానాల రాకపోకలన్నీ తూర్పు నౌకాదళ అధికారుల పర్యవేక్షణలోనే ఉంటాయి.రోజూ ఐదు గంటలపాటు నిషేధం విధిస్తే ఆ సమయంలో తమ కార్యకలాపాలను ముమ్మరం చేసుకోవచ్చనే ఆలోచనలో నౌకదళ అధికారులున్నారు. అయితే ఈ నిర్ణయం కారణంగా ఇండిగో, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఏషియా, జెట్‌ ఎయిర్‌ వేస్‌, శ్రీలంకన్‌ ఎయిర్‌ వేస్‌ తమ సర్వీసులను మార్చుకోవాల్సి వస్తుంది. విమానయాన సంస్థలు ఒకే విమానాన్ని ఒకే రోజు వివిధ ప్రాంతాల మధ్య నడుపుతుంటాయి. ఒకచోట సమయం మార్చుకోవాల్సి వస్తే దాని ప్రభావం ఇతర ప్రాంతాల విమాన సమయాలపై పడుతుంది. చివరకు ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతి, నగర అభివద్ధి దెబ్బ తినే ప్రమాదం ఉంది. విమానాశ్రయంలో రోజుకు ఐదు గంటల సమయం పాటు విమానాల రాకపోకలను నిషేధించనున్న విష యంపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విషయం కావడంతో నౌకాదళ, పౌర విమానయానశాఖల అధి కారులు, విమానయాన సంస్థల ప్రతినిధులు కూర్చుని మాట్లాడు కున్నాం. నిషేధిత సమయాన్ని ఎంతకాలం కొనసాగి స్తారన్న అంశంపై నౌకాదళం నుంచి స్పష్టత రాలేదు.
జి.ప్రకాశ్‌ రెడ్డి, ఎయిర్‌ పోర్టు డైరెక్టరు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*