కేంద్ర మంత్రులతో మోడీ కీలక సమావేశం

walk-extra-mile-to-ensure-implementation-of-schemes-pm-modi-to-ministers

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు క్షేత్ర స్థాయిలో అందరికి అందేలా చూడాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలుచేసేందుకు మంత్రులు ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరం గురించి మోడీ నొక్కి చెప్పారు. కేంద్ర బడ్జెట్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయన తన మంత్రివర్గ సహచరులతో గురువారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మంత్రులు తమ తమ శాఖల బడ్జెట్ ప్రాధాన్యతలు, ఖర్చుల గురించి కూలంకషంగా సమీక్షించుకోవాలని సూచించారు. పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు వాగ్దానాలను తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడమే కాకుండా విజయవంతంగా కార్యరూపంలో పెడుతోందన్నారు. బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశ ప్రజలకు మేలు జరుగుతోందనే దానిలో సందేహం లేదని చెప్పారు. వచ్చే నవంబరు 16వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంత్రులంతా తమ తమ శాఖలకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ సమాచారాన్ని కలిగి ఉండాలని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*