జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, మద్యం ఉత్పత్తులు వద్దేవద్దు

తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలన్న ఉద్దేశంతోనే జీఎస్టీకి మద్దతిచ్చామని, కానీ, కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తన అధికారంతో రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తున్న కేంద్రాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గకుండా పన్ను విధానాలుండాలని అభిప్రాయపడ్డ యనమల, జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, మద్యం ఉత్పత్తులను తెచ్చేందుకు తాము అంగీకరించే సమస్యే లేదని వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*