యోగి ఆకస్మిక తనిఖీలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగంపై క్రమంగా పట్టుబిగిస్తున్నారు.. రాష్ట్రంలో అక్రమ కబేళాల మూసివేతకు ఆదేశించిన మరుసటి రోజే పోలీస్‌ యంత్రాంగంపై దృష్టిసారించారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న ఆదిత్యనాథ్‌ గురువారం ఉదయం హజ్రత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచారు. విధుల నిర్వహణలో పోలీసులు అప్రమత్తతను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవటానికైనా వెనుకాడబోమని ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. సిబ్బంది పనితీరు గురించి పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులోనూ కొనసాగించనున్నట్లు వెల్లడించారు. కర్తవ్య నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని విస్పష్టం చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్పటి వరకూ యూపీలో 100 మంది పోలీసు సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో అత్యధికులు కానిస్టేబుళ్లు కాగా ఏడుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘన వంటి ఆరోపణలతో వారిపై ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*