జగన్‌కు పవన్ కల్యాణ్ తలనొప్పి

ys-jagan-not-upto-the-mark-as-opposition-leader

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఓ వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంటూ ఆ ప్రభుత్వ వ్యతిరేకత వైయస్ జగన్‌కు ఉపయోగపడుతుందని చెప్పలేమని అన్నారు. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆశించిన స్థాయిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌కు తక్కువ మార్కులు పడుతాయనే అభిప్రాయం కూడా అందులో ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైయస్ జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను తన వైపు తిప్పుకునే స్థాయిలో జగన్ వ్యూహాలు, కార్యాచరణ లేవా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దానికితోడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైన సమస్యలపై ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ జగన్ విస్తరణకు ఆటంకం కలిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వంపై సుతిమెత్తగా వ్యవహరించడం ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై వైయస్ జగన్ చంద్రబాబును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి వెనకాడుతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. కేసులకు భయపడే ఆయన మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి భయపడుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*