అందుకే మేం రాజకీయాల్లో ఉన్నాం: వైయస్ వివేకానంద రెడ్డి

ys-vivekananda-reddy-says-we-are-not-power

తాము ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాలలో ఉన్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. తాము అధికారాన్ని అనుభవించడానికి రాజకీయాల్లో లేమని ఆయన సోమవారం నాడు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కడప జిల్లా రాజంపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థాగత ఎమ్మెల్సీ ఎన్నికల సభ జరిగింది. ఈ సమావేశంలో వైయస్ వివేకానంద మాట్లాడారు. ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. కాగా, వైయస్ వివేకానంద రెడ్డి తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం కొనసాగారు. వైయస్ జగన్ వైసిపిని స్థాపించినా ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ తర్వాత మంత్రిగా పని చేశారు. అనంతరం వైయస్ విజయలక్ష్మి పైన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసిపిలో చేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*