మైండ్ గేమ్‌లో ఎవరిది పైచేయి?

ysrcp-focus-on-tdp-national-secretary-nara-lokesh

చాలా రోజుల తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటి వరకు రాజధాని భూములు, ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు లాంటి అంశాలపై అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ గత కొన్ని రోజులుగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. అయితే అనూహ్యంగా టీడీపీ నుంచి అంతకు మించి ఎదురుదాడి మొదలు కావడంతో మైండ్ గేమ్ ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పను నారా లోకేశ్ పార్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా నిలబెట్టి అవమానించారంటూ ఫొటో ఆధారంగా వైసీపీ నేతలు వరస విమర్శలు చేయటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే, అసలు ఆరోజు సమావేశంలో ఏ జరిగిందో ప్రజలకు తెలియాలని లోకేశ్ వీడియో విడుదల చేయటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. అంతేకాదు వైసీపీ అనవసరంగా లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తోందనే భావన ప్రజలలో పెరగింది. అంతేకాదు వ్యూహాత్మంకగా దెబ్బతిన్నామని అటు వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*